![](file:///C:/DOCUME%7E1/virandra/LOCALS%7E1/Temp/moz-screenshot.png)
అది "రుధిరోధ్గారి నామ సంవత్సరం", వింటానికి కొంచెం కొత్తగా అనటానికి అలాగే చెత్తగా ఉన్నా...అంకెలలో దానిని 1983వ సంవత్సరం అంటారులెండి...మార్చ్ నెల..పుర్తిగా ఎండాకాలం కాదు అలాని చలి, వానా కాలాలుకావు, కొద్దిగా అది కొద్దిగా ఇదీనూ...సరిగ్గా నెలమధ్య అంటే 16వ తారీఖన్నమాట, పగలూ కాదు రాత్రీ కాదు సాయంసంధ్యా సమయం...చల్లటి గాలి, ఆసుపత్రి వాతావరణం బయట ప్రసాంతంగా లోపల హడావిడిగానూ ఉంది.
నాగేంద్రగారి వాచీ టిక్కు-టిక్కు చెప్పుల కిర్రు-కిర్రు శబ్ధాలు, దూరంగా ఉన్న చుట్టాల కంగారుచూపులతో వరండా నిండిపోయింది.
సమయం 6గ:05నీ అయ్యింది సరిగ్గా అప్పుడు, డాక్టరుగారు గులాబీ రేకులలాంటి పాదాలతో ఉన్న పసివాడిని నాగేంద్రగారి చేతుల్లో పెట్టారు.....పిల్లాడు తెగఏడుస్తుంటే ఆపుకోలేక అడిగితే,డాక్టరు 2ని" ఫ్లాష్ బాక్కు చెప్పాడు .....
అదేంటనగా 6:03కి పిల్లాడు పుడితే,ఇంకా ఏడవట్లేదేంటాని వాడు ఏడ్చే 1/2 సెకండ్ల ముందరే. వాడి ఎర్రటి పిర్రమీద ఒక్కటిచ్హాడు..దాంతో అది ఇంకొంచెం ఎర్రదైంది...అలా మామూలుగా ఏడ్చేవాడిని గిల్లి ఏడ్పించాడా డాక్టరు, అలా చేస్తే కాని ఏడ్వలేదని మరీ చెప్పాడు చల్లగా..
6:03కి అశ్వనీ నక్షత్రం 3వ పాదం మేషరాశి లో పుట్టాడండి మా (నా) కథలోని జీరో కాని హీరో..
ఈ ఉపోధ్ఘాతమంతా వాడి (నా) కోసమే.....
లక్ష్మి గారు (మా అమ్మ) నాగేంద్ర గారు(నాన్న), వీరిద్దరి సంతానమైన నాకు పేరు పెట్టడం ఒక సమస్యైంది ,తాతలు అమ్మమ్మలు అనుక్కున్నవీ,అమ్మా నాన్నా అనుక్కున్నవీ కలిపితే కోనసీమ కొబ్బరి చాంతాడంత వచ్హింది..దానిని కత్తిరించి కుదించితే మిగిలింది నాపేరైంది..
అదేంటో తెలుసా....సారి అది ఎంత ఉందో తెలుసాఆఆఆఆఆ.....
"నాగ సత్య సూర్య వేంకటేశ్వర రాఘవేంద్ర సుబ్రమన్య భ్రమ్మలింగేశ్వర రామ నరశిమ్హ శ్రీ క్రిష్ణ "........